ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డిట్రాయిట్ ప్రాంతంలో శ్రీనివాస్ గోగినేని ఎన్నికపై నరేన్ కొడాలి హర్షం

డిట్రాయిట్ ప్రాంతంలో శ్రీనివాస్ గోగినేని ఎన్నికపై నరేన్ కొడాలి హర్షం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ముందే పలు చోట్ల కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఎన్నిక ఏకగ్రీవంగా మారనున్నది.  మిచిగన్‌ రాష్ట్రంలో ఉంటున్న శ్రీనివాస్‌ గోగినేని ప్రస్తుత తానా ఎన్నికల్లో రీజినల్‌ రిప్రజెంటేటివ్‌గా నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్‌కు వ్యతిరేకంగా ఎవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గోగినేని శ్రీనివాస్‌ గత 20ఏళ్లుగా డెట్రాయిట్‌ పరిసర ప్రాంతంలో ఉంటున్నారు. లీవోనియాలోని షిర్డీ సాయి ఆలయ ట్రస్టీగా ఉన్నారు. ఆయన ఏకగ్రీవం పట్ల డెట్రాయిట్‌ ప్రవాసులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఆయన ఎన్నిక పట్ల తానా వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న నరేన్‌ కొడాలి హర్షం వ్యక్తం చేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై శ్రీనివాస్‌ గోగినేని కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags :