ASBL NSL Infratech

నాటా మహాసభలు... ఆటల పోటీలు

నాటా మహాసభలు... ఆటల పోటీలు

నాటా మహా సభలను పురస్కరిం చుకుని వీర్నపు చినసత్యం నాయ కత్వంలో క్రీడల కమిటీ నాయకత్వం వహించి అనేక క్రీడా కార్యక్రమా లను నిర్వహించింది. ఈవెంట్‌లలో గోల్ఫ్‌, టేబుల్‌-టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌ మరియు టెన్నిస్‌ మరియు వాలీబాల్‌ వంటి ఇతర ఈవెంట్‌లను ఏర్పాటు చేశారు. ఆటల పోటీలపై చినసత్యం వీర్నపు మాట్లాడుతూ డల్లాస్‌లోని చాలా మంది ఫిట్‌నెస్‌, ఆరోగ్యంగా, స్పోర్టివ్‌గా ఉండటానికి ఉత్సాహాన్ని చూపుతున్నారని అలాంటి వారికోసం ఈ పోటీలని పేర్కొన్నారు. నిర్వహించిన అన్నీ ఆటలపోటీలకు మంచి స్పందన వచ్చిందని ఎంతోమంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారన్నారు. అన్నీ క్రీడా కార్యక్రమాలలో ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ టీమ్‌లు, సభ్యులు  పాల్గొనారన్నారు.

 

 

Tags :