ASBL NSL Infratech

ప్రపంచ మహాసభలు చారిత్రాత్మకం

ప్రపంచ మహాసభలు చారిత్రాత్మకం

తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రాత్మకమైనవని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్‌ భాషా పరిరక్షణ సంకల్పంతో వీటిని నిర్వహిస్తూ, ఆ బాధ్యతలు తమకు అప్పగించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మహాసభలలో ఆయన మాట్లాడుతూ మహాసభల ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యకు భాషణమే భూషణమని కొనియాడారు. మహాసభలతో తెలంగాణ కీర్తి పతాకస్థాయికి చేరుతుందని మన భాష మరింత సుసంపన్న మవుతుందని అన్నారు. మరుగున పడిన మహా కవులంతా మళ్లీ వెలుగులోకి వస్తారని కొత్త తరానికి వారి సాహిత్యపు విలువలు తెలుస్తాయని చెప్పారు. మహాసభల కోసం నిర్వహణ కమిటీతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Tags :