ASBL NSL Infratech

నేనూ తెలుగువాడిగా మారా : గవర్నర్‌

నేనూ తెలుగువాడిగా మారా : గవర్నర్‌

తెలంగాణలో తండేగు పువ్వు నవ్వినా, కోనసీమలో కొబ్బరాకు ఊగినా, రాయలసీమలో రాలుగాయి పలికినా అంతా కవిత్వమే. ఆద్యంతం ఆనందమే. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యాక్రమంలో మీ ముందు వినమ్రంగా మాట్లాడటం నాకెంతో ఆనందదాయకం అని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలు చూస్తుంటే మనం కట్టుకున్న స్వాగత ద్వారాల్లోంచి ఆదికవి నన్నయ మొదలు అమరుడైన సినారె వరకు వచ్చి ముందు వరుసలో కూర్చొని భువన విజయం జరుపుతున్నట్లుగా ఉంది. ద్రవిడ భాషల్లో ముఖ్యమైన తెలుగు భాష అత్యంత పురాతనమైంది. ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాషల్లో 14వ స్థానంలో, ఆసియాలో 7వ భాషగా, దక్షిణాదిలో మొదటిగా వెలుగుతున్నది మన తెలుగు.

ఆదికవి నన్నయ నుంచి చాలా దశలు దాటి భావ కవులు, అభ్యుదయ కవుల ఆలోచనలను తనలో ఇముడ్చుకుని తెలుగు భాష భిన్న ప్రక్రియలతో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే ఇతర ఏ సాహిత్యంలో లేని అవధానం తెలుగువారికే సొంతం కావడం గర్వకారణం. భాషా సాహిత్యం ఇంత సుసంపన్నం కావడానికి కారణభూతమైన ఎందరో మహానుభావులు స్మరించుకోవడానికి, భావితరాలకు తెలుగు భాషను అందించడానికి ఈ మహాసభలు ఒక గొప్ప అవకాశం అన్నారు.

Tags :