ASBL NSL Infratech

ఆల్బనీలో అలరించిన శోభకృత్ ఉగాది వేడుకలు

ఆల్బనీలో అలరించిన శోభకృత్ ఉగాది వేడుకలు

ఆల్బనీలో ఉన్న తెలుగువారు సంప్రదాయబద్దంగా శ్రీ శోభకృత్‌ ఉగాది వేడుకలను ఆల్బనీ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. న్యూయార్క్‌లోని ఈస్ట్‌ గ్రీన్‌బుష్‌లో ఉన్న జినెత్‌ ఎలిమెంటరీలో ఏప్రిల్‌ 2వ తేదీన జరిగిన ఈ వేడుకలకు తెలుగువాళ్ళు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అధ్యక్షుడు శ్రీధర్‌ కొత్తగుండ్ల అందరికీ ఆహ్వానం పలికి శ్రీ శోభకృత్‌ ఉగాది వేడుకలను తెలియజేశారు. ఆల్బనీ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గాయనీ గాయకులు సమీర భరద్వాజ్‌, శ్రీకాంత్‌ సందుగు పాడిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. హిట్‌ సినిమాల్లోని పాటలను వారు పాడారు. ఈ వేడుకలకు యాంకర్‌గా సాహిత్య వ్యవహరించింది.

అధ్యక్షుడు శ్రీధర్‌ కొత్తగుండ్లతోపాటు, శివరామరాజు గణపతిరాజు (సెక్రటరీ), స్రవంతి కంచ (ట్రెజరర్‌), శాంతిప్రియ సొంపల్లి (జాయింట్‌ సెక్రటరీ), కనక ప్రసాద్‌ బైరాజు, శ్రీధర్‌ అర్వపల్లి, జగత్‌ కె గన్నబోయిన, జయప్రసాద్‌ నర్ర, రవీందర్‌ నిమ్మ, కిరణ్‌ పాల తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :