ASBL NSL Infratech

ఏఐఏ, తానా, బాలీ 92.3 ఎఫ్ఎం ఆధ్వర్యంలో సంయుక్తంగా దసరా, దీపావళి వేడుకలు! 

ఏఐఏ, తానా, బాలీ 92.3 ఎఫ్ఎం ఆధ్వర్యంలో సంయుక్తంగా దసరా, దీపావళి వేడుకలు! 

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ బాలీ 92.3 ఎఫ్ఎం, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంయుక్తంగా దసరా, దీపావళి వేడుకలు నిర్వహించనున్నాయి. అక్టోబర్ 21న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. కాలిఫోర్నియాలోని అలమెడ కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. డాక్టర్ ప్రకాష్ అద్వానీ, డాక్టర్ రోహిత్ అద్వానీ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం, సంజీవ్ గుప్తా ఆధ్వర్యంలో బాణాసంచా కార్యక్రమాలు జరగనున్నాయి. మహా మంగళ హారతి, రథయాత్రతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రామ్ లీలా, ఉచిత హెల్త్ ఫెయిర్, డిస్కో దాండియా, దేశీ ఫుడ్ ఫెస్ట్, మిఠాయి ఫెస్టివల్ వంటి ఎన్నో ఉత్సాహభరితమైన కార్యక్రమాలను ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.

 

 

Tags :