ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అలాంటి పాత్ర‌ల‌కు కూడా సిద్ధ‌మే: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

అలాంటి పాత్ర‌ల‌కు కూడా సిద్ధ‌మే: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

శ‌ర‌త్ కుమార్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ లో పెద్ద హీరోయిన్ అవాల‌ని ఎన్నో క‌లలు క‌నింది. కానీ ఆమెను సినీ ప‌రిశ్ర‌మ విల‌న్ గా గుర్తించింది. హీరోయిన్ గా కంటే విల‌న్ గానే ఆమె బాగా సూటవుతుంద‌ని ఆ ర‌క‌మైన అవ‌కాశాలిచ్చి వ‌ర‌ల‌క్ష్మీని ప్రోత్స‌హించింది. వాస్త‌వానికి విల‌న్ పాత్ర‌లే ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి కూడా.

అయితే ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మి త‌న రూట్ మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పాజిటివ్ రోల్స్, మెయిన్ లీడ్స్ లో కూడా న‌టిస్తూ వ‌స్తుంది అమ్మ‌డు. ప్ర‌తీసారి ఇలాంటి పాత్ర‌లు రావడం క‌ష్టం కాబ‌ట్టి వ‌ర‌ల‌క్ష్మి అన్ని విధాలుగా సిద్ధ‌ప‌డే టాలీవుడ్ లో లాంఛ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అక్క, వ‌దిన ఎలాంటి పాత్ర‌లైనా చేస్తానంటోంది వ‌ర‌ల‌క్ష్మి. ఇప్ప‌టివ‌ర‌కు అలాంటి పాత్ర‌లు రాక‌పోవ‌డం వ‌ల్లే చేయ‌లేదు కానీ వ‌స్తే ఎందుకు వ‌దులుకుంటానంటోంది.

అంతేకాదు, త‌న దృష్టిలో ఏదైనా ప‌నేన‌ని, న‌టిగా త‌న ప‌రిధిని పెంచుకోవ‌డానికి ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తూ ఉంటాన‌ని, భాష గురించి ఏ రోజూ ఆలోచించ‌లేద‌ని, ఇంట్రెస్టింగ్ గా అనిపించే పాత్ర ఏ భాష నుంచి వ‌చ్చినా చేస్తాన‌ని తెలిపింది. ఇప్ప‌టికే హ‌నుమాన్ సినిమాలో అక్క పాత్ర పోషించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ‌ర‌ల‌క్ష్మి చేతిలో ప్ర‌స్తుతం కొన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :