ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

9వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

9వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ) 
Contact: vangurifoundation@gmail.com : Phone:1 832 594 9054

----------------------------------------------------------------------

29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

"క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. అమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా మొదలైన పలు దేశాల నుండి  ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. “నా మొట్టమొదటి కథ”, “నా మొట్టమొదటి కవిత” విభాగాలకి ఈ సారి అధిక సంఖ్యలో కలం పట్టిన ఔత్సాహిక రచయితలకి మా ప్రత్యేక అభినందనలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ  కౌముది.నెట్, ‘మధురవాణి. కామ్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో  ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి. ఈ పోటీకి ఆర్ధిక సహకారం అందించిన వదాన్యులు శ్రీ మునుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్) గారికి అందరి తరఫునా ధన్యవాదాలు.

ప్రధాన విభాగం – 29వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు

‘ఓర్నీ అమ్మ’’- శర్మ దంతుర్తి (Elizabeth Town, OH) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 
“అసంకల్పిత ప్రతీకారాలు”- పాణిని జన్నాభట్ల (Boston, MA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 
‘వలస కూలీలు’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL- ప్రశంసా పత్రం
‘వైకుంఠపాళీ’- మధు పెమ్మరాజు (Katy, TX) -ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు

“కవిత్వం” - గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“పశ్ర్న”- శ్రీధర్ బిల్లా, Fremont, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఎంకి నాయుడు బావ”- మణి మల్లవరపు (Vancouver, Canada) ప్రశంసా పత్రం
“మొట్టమొదటి రచనా విభాగం” -16వ సారి పోటీ

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు

‘వేలెత్తి చూపిన పిల్లి’ - జీ.కే. సుబ్రహ్మణ్యం ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
‘రేసు గుర్రం - కోరుకొండ దుర్గాబాయి ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)  
పల్లెకు పోదాం ఛలో, ఛలో- రాపోలు సీతారామరాజు - ప్రశంసా పత్రం

"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు

“విరహ ప్రస్థానం”- దాసశ్రీ (దేవేంద్ర దాసరి) పెద్దహరివనం, కర్నూలు ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“నీవు ఎవరు? కాస వైశ్విక (తిర్మలాపూర్, జగిత్యాల జిల్లా) ($116 నగదు పారితోషికం (ప్రశంసా పత్రం)
కాలంతో కరచాలనం రిషిత్ సిరికొండ గొల్లపల్లి, జగిత్యాల జిల్లా (ప్రశంసా పత్రం)

న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో,

భవదీయులు

శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు
Vanguri Foundation of America, Inc.
3906 Sweet Hollow Court, Sugar Land, TX. 77498 
Email: vangurifoundation@gmail.com

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :