ASBL NSL Infratech

ఇరాన్ చర్యలతో ముప్పే : జానెట్ ఎల్లెన్

ఇరాన్ చర్యలతో ముప్పే : జానెట్ ఎల్లెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులపై అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ ఎల్లెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఉంటుందన్నారు. ఇరాన్‌ దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు ఆ దేశంపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల సమావేశాలు ఈవారం ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లెన్‌ ఈ హెచ్చరిక చేయడం విశేషం. ఆర్థిక ఆంక్షల్లో భాగంగా ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా మళ్లీ ఆంక్షలు  విధించబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇరాన్‌ నుంచి భారత చమురు దిగుమతులకు ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉంది. దీనికి తోడు చమురు ధరా చుక్కలంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :