ASBL NSL Infratech

విజ‌య్ లైన‌ప్ సూప‌ర్బ్

విజ‌య్ లైన‌ప్ సూప‌ర్బ్

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న‌కు గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తో మ‌రోసారి సినిమా అన‌గానే ఆ సినిమాకు మించి విజ‌యం సాధించొచ్చనుకున్నాడు విజ‌య్. కానీ ఆ సినిమా ఫ‌లితం మాత్రం అంచ‌నాల‌కు అంద‌కుండా ఫ్లాప్ అయింది. గ‌త కొన్నేళ్లుగా విజ‌య్ సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే గీత గోవిందం త‌ర్వాత విజ‌య్ కు స‌రైన సినిమా ప‌డింది లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ నిరాశ ప‌రిచిన‌వే. ఖుషి క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపించినా అది కూడా యావ‌రేజ్ సినిమానే. కానీ ఇప్పుడు విజ‌య్ లైన‌ప్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అఫీషియ‌ల్ గా వ‌చ్చిన అనౌన్స్మెంట్స్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉన్నాయి.

రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్వ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే పాన్ ఇండియా నేప‌థ్యం 19వ శ‌తాబ్దంలో ఉంటుంద‌ని క్లూ కూడా ఇచ్చారు. ఒక శాప‌గ్ర‌స్త‌మైన నేల‌ను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఏదో డిఫ‌రెంట్ గా ట్రై చేయ‌బోతున్నారు. ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ష‌న్ లో దిల్ రాజు నిర్మిస్తున్న వ‌యొలెంట్ డ్రామాకు క‌త్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అనే క్యాప్ష‌న్ తో పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. గౌత‌మ్ తిన్న‌నూరితో విజ‌య్ చేస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ కానీ పోస్ట‌ర్ కానీ రివీల్ చేయ‌లేదు. గ‌తంలో రివీల్ అయిన కంటెంట్ ప్ర‌కారం ఇది రా అండ్ ర‌స్టిక్ డ్రామా అనే విష‌యం క్లారిటీ వ‌చ్చేసింది. ఈ మూడు సినిమాల్లో ఏదీ రెగ్యుల‌ర్ సినిమా కాదు.  విజ‌య్ చేస్తున్న మూడు సినిమాలూ ప్ర‌యోగాలే. త‌న మార్కెట్ ను పెంచుకోవాల‌ని చూస్తున్న విజ‌య్ కు ఈ సినిమాలైనా అనుకున్న ఫ‌లితాన్నిస్తాయేమో చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :