ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాల‌య్య సినిమాలో మ‌రో స‌ర్‌ప్రైజ్

బాల‌య్య సినిమాలో మ‌రో స‌ర్‌ప్రైజ్

అఖండ‌, వీరసింహా రెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బాబీ కొల్లి ద‌ర్శక‌త్వంలో భారీ మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో మీద భారీ అంచ‌నాలున్నాయి. అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాబీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఊర్వ‌శీ రౌతెలా ఓ హీరోయిన్ గా న‌టిస్తోంది. బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ ఎవ‌రన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ కు చెందిన మ‌రో యంగ్ హీరో ఓ కీల‌క నెగిటివ్ రోల్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆ పాత్ర‌కు త‌మ్ముడి పాత్ర‌లో స‌ద‌రు యంగ్ హీరో క‌నిపించ‌నున్నాడ‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసిన బాబీ, ఇప్పుడు మ‌రో యంగ్ హీరోను కూడా ట్రాక్ ఎక్కిస్తున్నాడ‌ని తెలిసి ఇన్ని స‌ర్‌ప్రైజ్ లు త‌ట్టుకోల‌గ‌మా అంటూ బాబీని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ఎల‌క్ష‌న్స్ హ‌డావిడిలో ఉన్న బాల‌య్య‌, ఆ హ‌డివిడి అవ‌గానే బ‌ల్క్ డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :