ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు

సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు

మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలోని సెయింట్‌ లూయిస్‌ హిందూ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మే 24 నుండి 28 వరకు అయిదు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వీనులవిందుగా, సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశాన్ని ఇటీవల జరిగింది. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు సాక్షి విజయ్‌, ఉత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ తదితరులతో పాటు బోర్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, భక్తులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలు, చేయవల్సిన ఏర్పాట్లపై సమీక్షించారని బ్రహ్మోత్సవాల మీడియా కమిటీ అధ్యక్షుడు సూరపనేని రాజా ఓ ప్రకటనలో తెలిపారు.

వాలంటీర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి నాయుడు గంట మోగించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రారంభించారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేసిన నంది, గజ, హనుమ, సూర్య, శేష వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కోసం ఆలయం వెలుపల మాఢవీధులను నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఊరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని సైతం తయారు చేస్తున్నామని వెల్లడిరచారు. దీనితో పాటు అర్చకస్వాముల నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :