ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా.. ఓకేసారి ఆరు వేల మందిపై
ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా తన టెక్సాస్, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో పొదుపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూన్ 14 నుంచి కాలిఫోర్నియాలో 3,332 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా 10 శాతానికి పైగా ఉద్యోగులపై వేటు వేయనుందని గత వారం రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.
Tags :