ASBL NSL Infratech

అంబటి కష్టాలు వేరయా...?

అంబటి కష్టాలు వేరయా...?

మంత్రి అంబటిరాంబాబు.. మంచి వాగ్దాటి ఉన్న నేత. సీఎం జగన్ దగ్గర కాస్త పరపతి కూడా ఉంది. వాటన్నింటినీ ఉపయోగించి టికెట్ దక్కించుకున్నారు అంబటి. అయితే ఇప్పుడా అంబటి రాంబాబు.. ఎన్నికల్లో ఎదురీదుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు తమ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం పెద్దగా సహకరించడం లేదన్న చర్చ నడుస్తోంది. గతంలో అంబటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆ సామాజికవర్గం నేతలు.. ఇప్పుడు అంబటికి వ్యతిరేకంగా ఉన్నట్లు సంకేతాలున్నాయి.

ఏదో ఆ విపత్తు నుంచి ఎలాగోలా బయటపడదామంటే.. ఇప్పులు ఇంటిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంబటి సొంత అల్లుడు తన మామకు ఓటు వేయొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వీడియోని పోస్ట్ చేశాడు. డాక్టర్ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా.. తన మామకు ఓటు వేయద్దు అని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరోవైపు అరగంట కామెంట్స్ ఉండనే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా, ఏడిబేట్ లో పాల్గొన్నా దీనిపైనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో అంబటికి కూడా ఆగ్రహమొచ్చేస్తోంది. కానీ ఏం చేస్తారు.. వీటికి అడ్డుకట్ట పడే పరిస్థితిలేదు. దీంతో మహిళల ఓట్లసంగతి గోవిందా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. అయితే జగనన్నను చూసి గుద్దేస్తారులే అన్న ధీమా ఒక్కటే వారిలో కనిపిస్తోంది. మరోవైపు..ఈ వీడియోను సొంత అల్లుడే చేయడంతో.. వైసీపీ నేతలు కూడా బయటకు ఏమీ అనలేకపోతున్న పరిస్థితి ఉంది.

మరోవైపు...టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగడం.. అంబటికి కాస్త సవాల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అంబటిపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలుండడంతో .. అది ఎక్కడ పార్టీకి చేటు చేస్తుందో అన్న భయం క్యాడర్ లో కనిపిస్తోంది. మరోవైపు..కన్నా లక్ష్మీనారాయణ.. కాంగ్రెస్ లో సీనియర్‌ నేత. గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమల్లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. సత్తెనపల్లితో కొద్దో గొప్పో సంబంధాలు ఉన్నాయి. 2019లో నరసరావుపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది టీడీపీలో చేరారు. ఆయన్ను చంద్రబాబు సత్తెనపల్లి ఇన్‌చార్జిగా ప్రకటించారు. నాటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అన్ని వర్గాలతో మమేకమై.. టీడీపీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :