ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కోడికత్తి 2.0 వెర్షనేనా..?

కోడికత్తి 2.0 వెర్షనేనా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై రాయి దాడి.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాక్షాత్తూ వైసీపీ అగ్రనేతలు, మంత్రులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచనే అంటూ ఆరోపిస్తుండడంతో విపక్ష పార్టీ అప్రమత్తమైంది. దాడి జరిగిన వెంటనే ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు... కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ ట్వీట్ చేయడం దీనిలో భాగంగానే కనిపిస్తోంది. అంతేకాదు..నాడు కోడికత్తి, నేడు రాయిదాడి అంటూ సెటైర్ వేశారు. దీంతో విపక్ష టీడీపీ .. అధికార పార్టీ ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా పడిందని అందరికీ అర్థమైందని చెప్పొచ్చు.

సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈపరిణామం రాజకీయ వేడిని పీక్స్ కు చేర్చింది. గతంలో కోడికత్తి అంశం ఎన్నికల ప్రచారంగా మారడంతో..వైసీపీకి రాజకీయంగా లబ్ధిని చేకూర్చింది. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదని పట్టుదలగా ఉన్న టీడీపీ.. సోషల్ మీడియాలోనూ కౌంటర్స్ వేస్తోంది. ఏపీ ప్రజలు అంత అమాయకులు కాదని.. ఏం జరిగిందో అందరికీ తెలుసని ట్వీట్స్ పెడుతున్నారు.

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు బస్సుపై రాళ్లదాడి సమయంలో... మంత్రులకామెంట్లను వెతికి తీసి మరీ పోస్టుచేస్తున్నాయి టీడీపీ సోషల్ ఆర్మీ శ్రేణులు.. విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉండడంతోనే... ఇలాంటి రాళ్లు పడతాయని అప్పుడు మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇదంతా నాటకమని కొందరు వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడు జనంపైనా విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉందని... దాని కారణంగానే రాళ్లు పడి ఉండొచ్చని కూడా ఓ వాదన తెరపైకి తెస్తున్నారు.

సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యంపైనా టీడీపీ అభిమానులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సీఎం రోడ్ షో జరుగుతుంటే కరెంట్ ఎందుకు తీశారు? భద్రత చూడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు జగన్ ప్రతి ఎన్నికల ముందు ఒక డ్రామా అడుతున్నారని, దాన్ని ప్రతిపక్షంపై నెడుతున్నారంటూ సోషల్ మీడియాలో సీక్వెన్స్ పై పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మొత్తం జగన్ కనుసన్నల్లో నడుస్తోందని.. ఈదాడికి బాధ్యత విపక్షానిదెలా అవుతుందని నిలదీస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :