ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

TAL జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024

TAL జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) వారి ఆధ్వర్యంలో “తాల్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024”  శనివారం 16 మార్చి 2024 న మరియు 6-ఏప్రిల్ 2024 న  ఓస్టర్లీ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ సెంటర్, ఐల్ వర్త్, లండన్ (వెస్ట్) లో ఘనంగా జరిగాయి.

లండన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని  ప్రత్యేకంగా వీక్షించారు. ఈ క్రీడా కార్యక్రమం లో 250 మందికి పైగా మెన్స్ డబుల్స్, మెన్స్ 40+ డబుల్స్, మిక్సడ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్,  కిడ్స్ అండర్ 16 లాంటి అనేక విభాగాల్లో పాల్గొన్నారు.

ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీలో పాల్గొనేవారి నాణ్యత , కృషిని కొనియాడారు మరియు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి TAL చేసిన ప్రయత్నాలను ప్రశంసించాడు.

శ్రీ రవి సబ్బ (చైర్మన్), శ్రీ కిరణ్ కప్పెట (వైస్ చైర్మన్) ఈ సందర్భంగా అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వాలంటీర్స్ కు, క్రీడాకారులకు, కార్యకర్తలు సుధాకర్ గుబ్బల (కోర్ టీమ్), బాలాజీ కల్లూరు (కోర్ టీమ్), అనిల్ రెడ్డి (కోర్ టీమ్), రాజేష్ వీరమాచనేని, రాజేష్ తోలేటి (TAL మాజీ వైస్ చైర్మన్/కోశాధికారి), వెంకట్ నీల (ట్రస్టీ – నిధుల సేకరణ), అనిల్ అనంతుల (ట్రస్టీ – మెంబర్‌షిప్ & ట్రెజరర్), రాయ్ బొప్పన (ఐటీ ఇన్‌ఛార్జ్) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

విజేతల వివరాలు:

విభాగం

ప్రథమ బహుమతి 

ద్వితీయ బహుమతి 

బాలికలు డబుల్స్ అండర్ 16

సుస్మిత & జిత్య

ప్రజ్ఞా మూల & సహస్ర మీనావళి

బాలురు డబుల్స్ అండర్ 16

విష్ణు బండారి & దృషిత్ పాతూరి

వేపాడ సంజీవ్ & వేపాడ శ్రీ సాయి చరణ్

మహిళల డబుల్స్

పూజిత మోహన్ & చుకారియా జ్యోత్స్న

స్మిత రెడ్డి & గీతిక అల్లంకు

మహిళలు 35 +సంవత్సరాలు

పల్లవి పవన్ & వాసవి వంశీ

రాధిక కాంతారెడ్డి & శ్వేతా కాంతారెడ్డి

మిశ్రమ డబుల్స్

మనోభి రామ్ & జ్యోత్స్న సి

సాయికిరణ్ సలాది & పూజిత మోహన్

పురుషులు 40+ డబుల్స్

వరుణ్ & అంజి

రాజేష్ తోలేటి & సాయి కె

పురుషుల డబుల్స్

తేజ & మనోభి రామ్

రాజేష్ తోలేటి & కళ్యాణ్

బెస్ట్ ప్లేయర్: మనోభిరామ్

ఎమర్జింగ్ ప్లేయర్: కళ్యాణ్

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :