సుప్రీంకోర్టు కోర్టు మరో అడుగు ... వాట్సాప్ లో
డిజిటలైజేషన్లో సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది. ఈ-కోర్టులతో ప్రజలకు మరింత చేరువ అయిన సుప్రీంకోర్టు ఇపుడు అడ్వొకేట్ ఆన్ రికార్డ్, కక్షిదారులకు సమాచారం అందించడంలో మరో అడుగేసింది. కాజ్ లిస్ట్, కేసుల జాబితా, ఫైలింగ్ ఆర్డర్లు, తీర్పులు అన్నీ అడ్వొకేట్ ఆన్ రికార్డ్, కక్షిదారులకు వాట్సాప్ సమాచారం ద్వారా అందజేయనున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ పరిణామాన్ని బిగ్ బ్యాంగ్ ప్రభావంగా సీజేఐ అభివర్ణించారు. కాగితం వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.
Tags :