ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తేజ స‌జ్జ‌పై విమ‌ర్శ‌లు

తేజ స‌జ్జ‌పై విమ‌ర్శ‌లు

బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తేజ హీరోగా కెరీర్ ను ఆరంభించి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తేజ హీరోగా నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హనుమాన్‌ సినిమా తేజ కి హీరోగా మంచి బ్రేక్‌ ని ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

తేజ స‌జ్జ హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి మంచి సినిమాల‌తో ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేశాడు. తేజ హీరోగా చేసిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. హ‌ను మాన్ సినిమాతో త‌న క్రేజ్ ను దేశ న‌లుమూల‌ల‌కు వ్యాప్తి చేసుకున్న తేజ ద‌గ్గ‌ర‌కు ప్ర‌స్తుతం ఎంతో మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అడ్వాన్స్ తో క్యూ క‌డుతున్నార‌ట‌. హ‌ను మాన్ సెట్స్ పై ఉన్న టైమ్ లోనే త‌న‌కు ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, కానీ హ‌ను మాన్ పూర్త‌య్యాకే కొత్త సినిమాకు క‌మిట్ అవుతాన‌నే కార‌ణంతో తేజ వాటన్నింటినీ తిర‌స్క‌రించాడు.

ఇప్పుడు కూడా తేజ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ల‌కు నో చెప్తున్నాడ‌ట‌. గ‌తంలో రెమ్యూన‌రేష‌న్ కు ప‌ది రెట్లు ఆఫ‌ర్ చేసిన‌ప్ప‌టికీ తేజ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం మిరాయ్ చేస్తున్న తేజ‌, ఆ సినిమాతో మ‌రో సూప‌ర్ హిట్ ను అందుకుంటాడ‌నిపిస్తుంది. అందుకే తేజ ద‌గ్గ‌ర‌కు ప్ర‌ముఖ నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. కానీ తేజ మాత్రం వారిని కూడా సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నాడట‌. దీంతో పెద్ద నిర్మాత‌ల‌కు కూడా నో చెప్తావా?

సినిమా త‌ర్వాత సినిమా చేయ‌డానికి నువ్వేమైనా స్టార్ హీరోవా? ఎన్ని అవ‌కాశాలొస్తే అన్ని సినిమాలు చేయాలి కానీ అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ ఛాన్సులొస్తున్నాయి క‌దా అని సినిమాలు చేసుకుంటూ పోతే సినిమాల లెక్క పెరుగుతుంది కానీ హిట్ సినిమాలు రావు కదా! అని తేజకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు సినీ పండితులు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :