ASBL NSL Infratech

ఏపీలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి.. కీలక విషయాలు వెల్లడించిన ఈసీ

ఏపీలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి.. కీలక విషయాలు వెల్లడించిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపాం. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయి. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవి కావడంతో పరిష్కరించాం. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతరాష్ట్ర చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్‌ చేశాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :