ASBL NSL Infratech

అమిత్ షా ఫేక్ వీడియో కేస్.. ముగ్గురు టీ.కాంగ్రెస్‌ నేతల అరెస్టు..

అమిత్ షా ఫేక్ వీడియో కేస్.. ముగ్గురు టీ.కాంగ్రెస్‌ నేతల అరెస్టు..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి ఘాటుగా మాట్లాడిన ఓ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మార్ఫింగ్ కేసు విచారణ విషయంలో తమ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరో ముగ్గురిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు కావడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్‌ తో పాటు నవీన్, తస్లీమాను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా ఈ అరెస్టులు తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరుగుతున్నాయి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్టుగా సృష్టించిన ఆ ఫేక్ వీడియో వైరల్ చేసిన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టత కూడా ఇచ్చారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా విషయం పైకి కనిపిస్తున్నంత సామాన్యంగా లేదు అన్ని అందరూ అభిప్రాయపడుతున్నారు.



 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :