ASBL NSL Infratech

ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసిన "మా ఊరి పొలిమేర 2"

ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసిన "మా ఊరి పొలిమేర 2"

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ "మా ఊరి పొలిమేర 2" ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ దక్కింది. ఆమె తరుపున దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరు కృష్ణ, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డ్ తో పాటు "మా ఊరి పొలిమేర 2" దర్శక నిర్మాతలకు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' నిర్వాహకులు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను అందించారు. మంగళవారం ఢిల్లీలో ఈ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. తమ సినిమాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో దక్కిన గుర్తింపు సంతోషాన్నిస్తోందని, డాక్టర్ కామాక్షి భాస్కర్ల "మా ఊరి పొలిమేర 2" సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రశంసించారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.

లాక్ డౌన్ టైమ్ లో "మా ఊరి పొలిమేర" డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో సీక్వెల్ "మా ఊరి పొలిమేర 2" రూపొందించారు. ఈ సినిమా 2023 నవంబర్ 3న  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు కృష్ణ నిర్మించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్, ఓటీటీ లో ప్రేక్షకుల రివార్డ్ తో పాటు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' లో అవార్డ్స్ దక్కడంపై "మా ఊరి పొలిమేర 2" మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :