ASBL NSL Infratech

వారికి గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్.. ఏఐతో అదిరిపోయే ఫీచర్!

వారికి గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్.. ఏఐతో అదిరిపోయే ఫీచర్!

ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునే వారి కోసం ఈ ఫీచర్‌ ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ ఫీచర్‌ పని చేస్తుంది. గూగుల్‌ సెర్చ్‌ల్యాబ్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా భారత్‌ సహా అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనుజులా లో దీన్ని తీసుకొచ్చింది. ఈ స్పీకింగ్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనాలంటే గూగుల్‌ సెర్చ్‌ ల్యాబ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని గూగుల్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. అందులో ల్యాబ్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్‌పరమెంట్‌ విభాగంలో స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి. మీ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టొచ్చు. మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో ఇంగ్లిష్‌ నుంచి లేదా ఇంగ్లిష్‌లోకి ఏదైనా తర్జుమా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్‌ దర్శనమిస్తుంది.

ఈ స్పీకింగ్‌ ప్రాక్టీస్‌లో నేరుగా మాట్లాడొచ్చు లేదంటే టైప్‌ చేయొచ్చు.  దానికి ఏఐ సమాధానం ఇస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో తెలియజేస్తుంది. దానికి ఫాలో ఆప్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ను బట్టి సమాధానాలు వస్తాయి. ప్రస్తుతం డ్యులింగో, బాబెల్‌ వంటి లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్స్‌ ఉన్నాయి. అయితే, వీటిలో నేర్చుకునే వ్యక్తి స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. గూగుల్‌లో మాత్రం అలాంటిదేమీ లేదు. రోజువారీ సంభాషణల ఆధారంగా కొత్తగా పదాలను చేరుస్తూ ఇంగ్లిష్‌ మాట్లాడడంలో సహాయపడుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :