ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తున్నాం : అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు

హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తున్నాం : అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు

అమెరికాలో హిందువులు, హిందూమతం పట్ల వ్యతిరేక మతోన్మాదం, హిందూ ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు. ఈ మేరకు శ్రీ థానేదార్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పడిన హౌస్‌ కమిటీకి సిఫార్సు చేశారు. హిందూ అమెరికన్లు దేశ అభ్యున్నతిలో పాలు పంచుకుంటున్నప్పటికీ వారి నమ్మకాలు, వారసత్వం, చిహ్నాలకు సంబంధించి అస్యత సమాచారం వ్యాప్తి చెందుతోందని, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో వేధింపులు, వివక్షను ఎదుర్కొంటున్నారని తీర్మానంలో పేర్కొన్నారు.

విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షతో కూడిన నేరాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ఏటా పెరుగుతున్నాయని ఎఫ్‌బీఐ హేట్‌ క్రైమ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదికలో పేర్కొన్నట్లు తీర్మానంలో వెల్లడిరచింది. 1900 సంవత్సరం నుంచి 4 మిలియన్లకు పైగా హిందువులను అమెరికా స్వాగతించిందని, వారి సహకారంతో దేశంలో ఎంతో ప్రయోజనం పొందిందని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :