అమెరికాలో కలకలం.. మరో కొత్త వేరియంట్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ.5 వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడిరచింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పెక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు వెల్లడిరచారు. ఈజీ.5 కాకుండా ఎరిస్ లేదా ఈజీ.5.1 అని పిలవబడే మరో కొత్త వేరియంట్ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది.
Tags :