ASBL NSL Infratech

ట్రంప్‌ విచారణ జరిగే కోర్టు వద్ద.. కలకలం

ట్రంప్‌ విచారణ జరిగే కోర్టు వద్ద.. కలకలం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. అతడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. మంటల్లో చిక్కుకున్న అతడు నేలపై పడుకొని ఉండటం అందులో కనిపించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ప్రజలు మంటలను ఆర్పేసేందుకు ప్రయత్నించారు. అత్యవసర సిబ్బంది అక్కడికి వచ్చి స్ట్రెచర్‌ పై అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :