ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూర‌ప్‌లో మ‌హేష్ స్పెష‌ల్ ట్రైనింగ్?

యూర‌ప్‌లో మ‌హేష్ స్పెష‌ల్ ట్రైనింగ్?

ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మ‌హేష్ బాబుకు ఆ సినిమా అనుకున్న ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో మ‌హేష్ త‌న దృష్టంతా రాజ‌మౌళితో చేయ‌బోయే సినిమా మీద పెట్టాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో త‌న పాత్ర కోసం మ‌హేష్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఫిట్‌నెస్‌పై కూడా మ‌హేష్ ఫోక‌స్ చేశాడు.

ఇదిలా ఉంటే మేకోవ‌ర్ కోసం మ‌హేష్ ఎక్కువ‌గా విదేశాలు వెళ్తాడ‌న్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, సినిమా పూర్త‌య్యాక‌, స‌మ్మ‌ర్ లో కూడా మ‌హేష్ ఎక్కువ‌గా యూర‌ప్ ట్రిప్ కు వెళ్తుంటాడు. అక్క‌డ కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు మ‌హేష్. రీసెంట్ గా మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి వెకేషన్ కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

ఫ్యామిలీతో క‌లిసి యూర‌ప్ వెళ్లిన మ‌హేష్ ఇంకా ఇండియాకు తిరిగి రాలేదు. కానీ త‌న ఫ్యామిలీ మాత్రం తాజాగానే హైద‌రాబాద్ లో అడుగుపెట్టారు. మ‌హేష్ మాత్రం ఇంకా యూర‌ప్ లోనే ఉన్న‌ట్లు స‌మాచారం. దీనికి కార‌ణం రాజ‌మౌళినే అని తెలుస్తోంది. రాజ‌మౌళితో మ‌హేష్ చేయ‌బోయే సినిమా కోసం స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట మ‌హేష్.

ఈ సినిమా కోసం లాంగ్ హెయిర్ తో ఓ న్యూ లుక్ లో మ‌హేష్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలో చూపించ‌ని విధంగా రాజ‌మౌళి, మ‌హేష్ ను ప్రెజెంట్ చేయ‌నున్నాడ‌ట‌. అందుకే మ‌హేష్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ మ‌రి కొన్నాళ్ల పాటూ యూర‌ప్ లోనే ఉంటాడ‌ని, త‌న లుక్ ఎక్క‌డా లీక్ అవకూడ‌ద‌ని రాజ‌మౌళి ముందే మ‌హేష్ కు సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలిసే ఛాన్సుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :