ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకున్న కృతి

రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకున్న కృతి

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ భామ కృతి శెట్టి మొద‌టి సినిమాతోనే వంద కోట్ల మార్క్ అందుకోవ‌డంతో ఆమెకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దానికి తోడు ఆమె లుక్స్ కూడా బావుండ‌టం త‌న‌కు ప్ల‌స్స‌యింది. దీంతో కృతికి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. తెలుగులో రెండో సినిమా శ్యామ్ సింగ‌రాయ్ కూడా మంచి హిట్ట‌యింది.

అలా చూస్తుండ‌గానే కృతి డిమాండ్ బాగా పెరిగిపోయింది. రెమ్యూన‌రేష‌న్ రెండు కోట్లు దాటిపోయింది. అయితే కృతి ఎంత ఫాస్ట్ గా రైజ్ అయిందో అంతే ఫాస్ట్ గా కింది ప‌డింది. మూడో సినిమా బంగార్రాజు యావ‌రేజ్ అవ‌గా, త‌ర్వాత చేసిన వారియ‌ర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, క‌స్ట‌డీ సినిమాలు డిజాస్ట‌ర్లుగా మిగిలాయి.

దీంతో కృతి డిమాండ్ పూర్తిగా ప‌డిపోయింది. క్ర‌మంగా అవ‌కాశాలు త‌గ్గాయి. రీసెంట్ గా శ‌ర్వానంద్ తో క‌లిసి మ‌న‌మే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ద‌క్కించుకుంది కృతి. త‌న‌పై ట్రెడిషిన‌ల్ హీరోయిన్ అనే ముద్ర ప‌డ‌టంతో గ్లామ‌ర్ ఫోటో షూట్స్ చేస్తూ సెక్సీగా క‌నిపించ‌డానికి కూడా రెడీ అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తుంది. అంతేకాదు త‌న రెమ్యూన‌రేష‌న్ కు కూడా స‌గానికి పైగా త‌గ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడైనా మ‌రి కృతికి ఆఫ‌ర్లు వ‌స్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే కృతి చేతిలో ప్ర‌స్తుతం రెండు త‌మిళ సినిమాలున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :