ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై ఏది: రేవంత్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి

ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై ఏది: రేవంత్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై లేదని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ మరచిందని, అన్నదాతలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కార్యాచరణ చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అన్యాయం చేసిందని ఆరోపించిన కిషన్ రెడ్డి.. దళిత బంధు, గిరిజన బంధు పేరుతో రైతులను కేసీఆర్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా బీఆర్‌ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తూ రైతులను దగా చేస్తోందని, రూ.2 లక్షల రుణ మాఫీ చేయకుండా రైతులను వంచిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినప్పటికీ అందులో ఒక్కటీ నెరవేర్చలేదని, వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

‘‘బ్యాంకులు అన్నదాతలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో సాగు కోసం రైతులు దళారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని మోసపోతున్నారు. రేవంత్‌రెడ్డికి ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో లేదు. రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోంది’’ అంటూ రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తానని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందని, కానీ ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పాత గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్.. తుక్కుగూడలో కొత్త గ్యారంటీలు ప్రకటించడం విడ్డూరమని అన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మరిచిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని, మరి ఒక్క రైతుకైనా అందజేశారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో ఎరువులను బ్లాక్‌లో కొనేవారని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బ్లాక్ మార్కెట్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో ప్రస్తుతం ప్రతి రైతుకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :