ASBL NSL Infratech

డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ వ్యక్తిగత విమర్శలు

డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ వ్యక్తిగత విమర్శలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా సంకోచించడం లేదు. తాజాగా ట్రంప్‌ జట్టును ఉద్దేశించి బైడెన్‌ వ్యంగ్యంగా మాట్లాడారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో శరీరంలోకి బ్లీచ్‌ ఎక్కించుకోమని ట్రంప్‌ మీకు సలహా ఇచ్చేవారు. అయితే, అది కాస్తా మిస్‌ అయ్యి ఆయన జట్టుకే చేరింది అంటూ ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా బైడెన్‌ ఇదే విషయంపై మాట్లాడారు. మీరు బ్లీచ్‌ తీసుకోకండి. అలా తీసుకోమని చెప్పే వ్యక్తికి ఓటు వేయకండి అని కోరారు. మరోపక్క స్లీపీ జో అంటూ అధ్యక్షుడిని ట్రంప్‌ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనాను ఎదుర్కోవడానికి క్రిమిసంహారక ఇంజెక్షన్‌  తీసుకోవాలని, అది ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తుందని అప్పట్లో ట్రంప్‌ తరచూ వ్యాఖ్యలు చేశారు. అలాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను గేమ్‌ చేంజర్‌ ఆయన అని చెప్పారు. నిరూపితం కానీ చికిత్సలను ప్రచారం చేశారు. అయితే, వీటికి వ్యతిరేకంగా వైద్యనిపుణులు తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :