ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారతీయ విద్యార్థుల మరణాలు పెరగకుండా చూడండి : ఎఫ్ఐఐడిఎస్

భారతీయ విద్యార్థుల మరణాలు పెరగకుండా చూడండి : ఎఫ్ఐఐడిఎస్

అమెరికాలో ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని, ఈ సంఖ్య పెరగకుండా నివారించడానికి అమెరికా ప్రభుత్వం, యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు, చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రవాస భారతీయ సమాజం ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) విజ్ఞప్తి చేసింది. మోనాక్సైడ్‌ విషప్రయోగం, అల్పోష్టత ( హైఫోథెర్మియా) అంశాలపై భద్రతాపరమైన పరిజ్ఞానం లోపించి పర్యావరణ మరణాలు సంభవిస్తున్నాయని, అనుమానాస్పద కాల్పులు, కిడ్నాపింగ్‌, ఆత్మహత్య లను ప్రేరేపించే మానసిక సమస్యలు, అనుమానాస్పద ప్రమాదాలు నుంచి హింసాత్మక నేరాల వరకు దారి తీస్తున్నాయని ఎఫ్‌ఐఐడీఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకనే సంబంధిత పాలక వర్గాలు భద్రత కలిగించే విద్యాబోధన పెంపొందించాలని, పరిశోధన, రిస్క్యూ చర్యలను మెరుగుపర్చాలని, సహచరుల ర్యాగింగ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేసింది. అమెరికాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి కనీసం 10 మంది భారతీయుల మరణాలు సంభవించాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :