అమెరికాలో భారీ కుంభకోణం.. పలవురు భారతీయులు
అమెరికాలో కొవిడ్ ఉద్దీపన పథకంలో జరిగిన భారీ కుంభకోణంలో పలువురు భారతీయ అమెరికన్ వ్యాపారులు సహా మొత్తం 14 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలో 5.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.435 కోట్లు) మేర ఈ అవినీతి జరిగినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి సమయంలో చితికిపోయిన వ్యాపార సంస్థలకు ఆర్థిక చేయూత అందించేందుకు అమెరికా ప్రభుత్వం నిధులు అందించింది. తప్పుడు పత్రాలతో నిందితులు వాటిని అక్రమంగా చేజిక్కించుకొని మోసానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వారిని అరెస్టు చేసినట్లు వెల్లడిరచారు. నిందితుల్లో వివిధ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్న మిహిర్ పటేల్, కింజల్ పటేల్, ప్రతీక్ దేశాయ్, వజహత్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, చిరాగ్ గాంధీ, భువేశ్ పటేల్, ధర్మేశ్ పటేల్, మిత్రా భట్టారాయ్, భార్గవ్ భట్, చింతక్ దేశాయ్, అంబ్రీన్ ఖాన్, ఉషా చపాయిన తదితరులు ఉన్నట్లు తెలిపారు. అభియోగాలు రుజువైతే వీరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.