ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. జులై 8, 9 తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కృత్రిమ మేదస్సుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించనున్న ఈ సదస్సులో అనేక అంతర్జాతీయ కంపెనీలు పాల్గొనున్నాయి. జాతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పాటు స్థానిక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటలీ జెన్సీకి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత  ప్రాధాన్యత ఉంది. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నీలజీ రంగం ఇది. కృత్రిమ మేధ, వ్యాపార, వాణిజ్య సేవా రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సు చాలా కీలకంగా  వినియోగిస్తున్నాయి. అయితే ఇంకా మెరుగుపర్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో సుప్రసిద్ధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పోటీ పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కృత్రిమ మేధస్సు సదస్సు జరగనుండటంతో తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు రానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :