ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో కలకలం... కరోనా కంటే 100 రెట్లు ప్రమాదం

అమెరికాలో కలకలం... కరోనా కంటే 100 రెట్లు ప్రమాదం

అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. హెచ్‌5ఎన్‌1 రకంగా దీన్ని గుర్తించారు. ఇది కరోనా కంటే 100 రెట్లు ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్‌5ఎన్‌ 1 వైరస్‌ వ్యాప్తి మానవాళికి అధిక ముప్పు కల్గిస్తుంది. ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అధిక మరణాల రేటుకు దారితీయొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆవులు, పిల్లులుపై హెచ్‌5ఎన్‌1 వైరస్‌ను గుర్తించినట్లు పిట్‌బర్గ్‌లోని ప్రముఖ బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డాక్టర్‌ సురేష్‌ కూచిపూడి తెలిపారు.  ఈ వైరస్‌ సులభంగా వ్యాప్తి చెందడమే కాకుండా మానవులకు సోకే ప్రమాదముందన్నారు. ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమ కన్సల్టెంట్‌ జాన్‌ ఫుల్టన్‌ మాట్లాడుతూ హెచ్‌5ఎన్‌1 మహమ్మారి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కోవిడ్‌-19 మహమ్మారి కంటే ప్రాణాంతకమని అన్నారు. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రమాదకరం, అధిక మరణాల రేటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :