సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు అమెరికాలో కుట్ర
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి ఆవరణలో కాల్పులకు అమెరికాలో పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుడి భుజంగా భావించే రోహిత్ గోదారా బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ కోరిక మేరకు ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరూ బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యులేనని తెలిసింది. మరోవైపు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన వ్యక్తుల కదలికలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుల్లో ఒకరిని విశాల్‌గా గుర్తించిన పోలీసులు, అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, కాల్పుల ఘటనలో దుండగులు ఉపయోగించిన బైక్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ బైక్ తాను కొద్దిరోజుల క్రితమే వేరే వ్యక్తికి అమ్మినట్లు అతడు చెప్పాడు.
Tags :