ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జూన్ నుంచి సినిమాల జాత‌రే!

జూన్ నుంచి సినిమాల జాత‌రే!

ఈ స‌మ్మ‌ర్ ను స్టార్ హీరోలంద‌రూ లైట్ తీసుకున్నారు. ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ కు ఇచ్చే ఇంపార్టెన్స్ స‌మ్మ‌ర్ సీజ‌న్ కు ఇవ్వ‌రు. ఈ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో ప్ర‌భాస్ క‌ల్కి వ‌స్తుందనుకుంటే లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయింది. ఎల‌క్ష‌న్స్ ఉన్న కార‌ణంగా సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈసారి జూన్ నుంచి అగ్ర హీరోలంద‌రూ వ‌రుస‌గా రిలీజ్‌ల‌ క్యూ క‌ట్టారు.

జూన్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు ఈ హంగామా ఉంటుంది. క‌ల్కి సినిమాను జూన్ లో రిలీజ్ చేద్దామ‌నుకుంటున్నారు. అదే నెల‌లో క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్-2ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో క‌మ‌ల్ న‌టిస్తున్నాడు. జూన్ నెల‌లోనే మ‌మ్ముట్టి ట‌ర్బో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

మ‌మ్ముట్టి కొడుకు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న ల‌క్కీ భాస్క‌ర్ జులై లో రిలీజ్ కు ముస్తాబ‌వుతోంది. ఆగ‌స్ట్ లో పుష్ప‌2 భారీగా రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజైన పుష్ప‌2 టీజ‌ర్ తో అంద‌రికీ అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఆ త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తున్న ఓజీ సెప్టెంబ‌ర్లో రిలీజ్ కానుంది. ప‌వ‌న్ హ‌డావుడి బాక్సాఫీస్ వ‌ద్ద త‌గ్గే లోపు ఎన్టీఆర్ దేవ‌ర‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రిస్తాడు. అక్టోబ‌ర్ 10న దేవ‌ర రిలీజ్ కానుంది. అదే నెల‌లో ర‌జ‌నీకాంత్ వెట్టాయ‌న్, అజిత్ విడాముయార్చి కూడా రిలీజ్ కానున్నాయి. మ‌రోవైపు గేమ్ ఛేంజ‌ర్ ను కూడా అక్టోబ‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి జూన్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు సినిమా ల‌వ‌ర్స్ కు పండ‌గ సీజ‌నే అన్న‌ట్లు చెప్పాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :