ASBL NSL Infratech

ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి వేలమంది పాల్గొంటున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో 17 వేల మంది కళాకారులు ఈ వేడుకల్లో ప్రదర్శన ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. మన చుట్టుపక్కల విభేదాలు తీవ్రం కావడం, ప్రతికూల భావనలు, మానసిక ఆరోగ్య సవాళ్లు నెల్కొన్న ప్రస్తుత తరుణంలో ఈ సాంస్కృతిక వేడుకలను నిర్వహించడం సంతోషదాయకం అని గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నట్లు వారు వివరించారు. భిన్నత్వం ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తాన్నీ ఒకే కుటుంబంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు 60 వేల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి కుషాల్‌ చోక్సీ తెలిపారు. భారత్‌కు చెందిన 700 మంది సంప్రదాయ నృత్య కళాకారులు 100 మంది ఉక్రెయిన్‌ డ్యాన్సర్లతో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :