ASBL NSL Infratech

చ‌ర‌ణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి రీజ‌న్ అదేనా?

చ‌ర‌ణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి రీజ‌న్ అదేనా?

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై ఈ సినిమా ఎంతో భారీగా తెర‌కెక్కుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్న 12వ ప్రాజెక్టుగా ఈ సినిమా రాబోతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందు రామ్ చ‌ర‌ణ్ హీరోగా యూవీ క్రియేష‌న్స్ లో భారీ స్థాయిలో ఓ సినిమాను ప్లాన్ చేశారు. గౌత‌మ్ ను ఈ సినిమాకు డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ముందే ఈ సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ క్రేజ్, రేంజ్ పెర‌గ‌డంతో స‌మీక‌ర‌ణాలన్నీ మారిపోయాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత త‌న రేంజ్‌కు త‌గ్గ సినిమాలే చేయాల‌ని చ‌ర‌ణ్ ఫిక్స‌యిన‌ట్లు తెలుస్తోంది. 

ఈ కార‌ణంతోనే గౌత‌మ్ తో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్ ని చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే సినిమాను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో గౌత‌మ్ తిన్న‌నూరి చేస్తున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. చ‌ర‌ణ్ తో అనుకున్న ప్రాజెక్ట్ ని త‌ను రిజెక్ట్ చేయ‌డం వ‌ల్లే విజ‌య్ తో చేస్తున్నాడంటున్నారు. అయితే ఇది అస‌లు రీజ‌న్ కాద‌ని తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ లో పోలీస్ గా క‌నిపించిన చ‌ర‌ణ్, గౌత‌మ్ సినిమాలో కూడా పోలీస్ క్యారెక్ట‌రే కావ‌డం, పీరియాడిక్ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో అది ఇష్టం లేకే ఈ సినిమాను చ‌ర‌ణ్ వ‌ద్ద‌న్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల ఇన్ఫ‌ర్మేష‌న్. తాజా స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ తో గౌత‌మ్ చేస్తున్న సినిమా పీరియాడిక్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ విష‌యం తెలియ‌క ఇంత మంచి ప్రాజెక్ట్ ను చ‌ర‌ణ్ ఎలా వ‌దులుకున్నాడా అని అంద‌రూ అనుకుంటున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :