ASBL NSL Infratech

వెంకీ పొర‌పాటు దిద్దుకోవాల్సిందే..

వెంకీ పొర‌పాటు దిద్దుకోవాల్సిందే..

స్టార్ హీరోలు సినిమాల సెలెక్ష‌న్‌లో ఎంత ఏమ‌ర‌పాటు వ్య‌వ‌హరించినా వాటి రిజ‌ల్ట్స్ ఆ త‌ర్వాత చాలా కాలం కొన‌సాగుతాయి. అది ఫుల్ లెంగ్త్ రోల్ అయినా, చిన్న క్యామియో అయినా స‌రే వారి కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డ‌నప్పుడు దాన్ని వదిలేయ‌డ‌మే బెట‌ర్. ఉదాహ‌ర‌ణ‌కు హ్యాండ్స‌ప్ సినిమాలో చిరూ, ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారాలో బాల‌కృష్ణ‌, కృష్ణార్జున‌లో నాగార్జున ఇలా వీటి వ‌ల్ల ఆయా ప్రొడ్యూస‌ర్‌ల‌కు ఏమైనా ఉప‌యోగ‌ముందేమో కానీ వారి కెరీర్ కు మాత్రం ఆ సినిమాల వ‌ల్ల డ్యామేజే జ‌రిగింది. 

రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కిసీకా భాయ్ కిసీకా జాన్ లో విక్ట‌రీ వెంక‌టేష్ చేసిన పాత్ర కూడా అలాంటిదే. ఈ సినిమాలో పూజా అన్న‌య్య‌గా క‌నిపించిన వెంకీ వ‌ల్ల సినిమాకు కానీ, వెంకీ కెరీర్‌కు కానీ ఒరిగిందేమీ లేదు. ఇంత‌కుముందు చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ వెంకీకి చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చింది. 

ఓరి దేవుడా సినిమాలో చిన్న క్యారెక్ట‌ర్ చేసినా అది కూడా సినిమా స్కేల్ ను ఏమంత పెంచ‌లేదు. దీంతో వెంకీ త‌ర్వాతి సినిమా అయిన సైంధ‌వ్ పై ద‌గ్గుబాటి ఫ్యాన్స్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కాబ‌ట్టి రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలాలు లేకుండా శైలేష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంక‌టేష్ 75 సినిమాల త‌ర్వాత ఇలా ప్ర‌యోగాలు చేయ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికీ స్నేహం కోస‌మో లేక ఇంకో కార‌ణం కోస‌మో త‌న‌కు సెట్ కాని కంటెంట్‌లో న‌టించ‌డం వ‌ల్ల ఆయ‌న‌కే న‌ష్టం ఎక్కువ జ‌రుగుతుంది. 

వెంకీ ఆ విష‌యం ఇప్ప‌టికైనా తెలుసుకుని ఇలాంటి సినిమాలు చేయ‌డం మానేస్తే బెట‌ర్. రానా నాయుడు-2లో అయినా కాస్త బూతులు, బోల్డ్ కంటెట్ త‌గ్గిస్తే బావుంటది కానీ అలాంటి అవ‌కాశాలేమీ క‌నిపించ‌డం లేదు. ఏదైతే ఏం మొత్తానికి సైంధ‌వ్ మీదే వెంకీ ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :