ASBL NSL Infratech

వాలెంటైన్స్ డే కానుకగా డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేసిన 'ఓ సాథియా' మూవీ "వెళ్లిపోయే" సాంగ్  

వాలెంటైన్స్ డే కానుకగా డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేసిన 'ఓ సాథియా' మూవీ "వెళ్లిపోయే" సాంగ్  

లవ్ సాంగ్స్, అందునా మెలోడీ ట్యూన్స్ ప్రేక్షక లోకానికి ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో 'ఓ సాథియా' అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్  కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. ఈ సాంగ్ రిలీజ్ చేసిన క్రిష్.. ఓ సాథియా సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఓ సాథియా అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది.  

గతంలో ఫేమస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల  మీదుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించగా.. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా వదిలిన 'వెళ్లిపోయే' సాంగ్ యూత్ ఆడియన్స్‌కి ఎంతో కనెక్ట్ అవుతూ యమ స్పీడుగా వ్యూస్ రాబడుతోంది. ఇప్పటిదాకా వదిలిన అప్‌డేట్స్ ఈ సినిమాపై ఓ రకమైన బజ్ క్రియేట్ చేశాయి. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :