ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇజ్రాయెల్ కు అండగా ఉంటాం : బైడెన్

ఇజ్రాయెల్ కు అండగా ఉంటాం : బైడెన్

ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఇరాన్‌ బెదిరింపులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అమెరికన్లతో పాటు ఇజ్రాయెల్‌కు తామూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లుఫ్తాన్సా విమాన సంస్థ టెహ్రాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం తాము సర్వీసులను నిలిపివేయడం లేదని, అయితే విమాన సమయాలను మారుస్తున్నామని తెలిపింది. పశ్చిమాసియాకు ప్రయాణించొద్దని తమ పౌరులను రష్యా విదేశాంగశాఖ హెచ్చరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :