ASBL NSL Infratech

ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించాం : బైడెన్

ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించాం : బైడెన్

జోర్డాన్‌లో తమ సైనికుల మరణానికి ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. అందుకు కారణమైన వారిపై ఎలా దాడి చేయాలో నిర్ణయించామని తెలిపారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌ మద్దతున్న ఏ ఉగ్ర సంస్థ ఈ దాడికి పాల్పడిరదో ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉంందని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.  ప్రతీకార  దాడులు చేయడానికి ఉన్న ప్రత్యామ్నాయాలను పెంటగాన్‌ సమీక్షిస్తోందని వెల్లడించారు. బైడెన్‌ మాత్రం ఇప్పటికే ఎలా దాడి చేయాలో నిర్ణయించామని ప్రకటించడం గమనార్హం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :