ASBL NSL Infratech

తాపీ మేస్త్రీ కావలెను... రూ.4.47 లక్షల వార్షిక వేతనం : యూఎస్ కాన్సులేట్ ఆఫర్

తాపీ మేస్త్రీ కావలెను... రూ.4.47 లక్షల వార్షిక వేతనం : యూఎస్ కాన్సులేట్ ఆఫర్

తాపీ మేస్త్రీకి రూ.4.47 లక్షల వార్షిక వేతనం అందిస్తామని ప్రకటించింది హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌.  వార్షిక వేతనంతో పాటు ఇతర ప్రయోజనలు ఉంటాయని నియామక ప్రకటనలో వెల్లడించింది. యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హైదరాబాద్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసిన ఈ నోటిఫికేషన్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ నియామకానికి అర్హత పరీక్షలున్నాయి. తప్పనిసరిగా ఆంగ్ల భాష వచ్చి ఉండాలని, హిందీ లేదా తెలుగు బాషలు మాట్లాడగలిగి ఉండాలని నిబంధన విధించారు. కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి, ఫ్లోరింగ్‌, మార్బుల్‌ ఫ్లోరింగ్‌, కాంక్రీట్‌ బ్లాక్స్‌ వాల్‌, స్టోన్‌ లేయింగ్‌, కట్టింగ్‌ బ్రిక్‌వర్క్‌ తదితర పనుల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25 కాగా పూర్తి వివరాల కోసం https://in.usembassy.gov/embassyconsulates/jobs/hyderabad/ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. అర్హత పరీక్షలు, ముఖాముఖి నిర్వహించి, పనితీరు పరిశీలన తదితర ఎంపిక ప్రక్రియ వివరాలను ఇందులో వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :