ASBL NSL Infratech

వ్యాపారాల్లోనూ తగ్గేదేలేదంటున్న హీరోయిన్స్..!

వ్యాపారాల్లోనూ తగ్గేదేలేదంటున్న హీరోయిన్స్..!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత టైమ్ స్పాన్ హీరోయిన్స్ కి ఉండదన్న విషయం తెలిసిందే. బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అయితే దాదాపు ఒక దశాబ్దం కెరీర్ పీక్స్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు హీరోయిన్స్ టైమ్ స్పాన్ కాస్త పెరిగిందని చెప్పుకోవొచ్చు. యంగ్ హీరోయిన్స్ వస్తున్నా, కొంత మంది సీనియర్ హీరోయిన్స్ మాత్రం తమ క్రేజ్ తో, నటనతో ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సూక్తిని ఈ తరం కథానాయికలు బాగానే వంటబట్టించుకున్నారు. ఇటు తమ అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ సినిమాలు చేస్తూనే, బిజినెస్సుల్లో సైతం తమ ప్రతిభని చూపిస్తున్నారు.

అయితే ఈ వ్యాపారరంగంలో ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ ఏ కనిపించడం విశేషం. ఇక వివరాల్లోకి వెళ్తే.. తన అందం, అభినయంతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన చందమామ కాజల్ అగర్వాల్. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వివాహం అనంతరం ఇటు సినిమాలపై ఫోకస్ చేస్తూనే తన ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా బాలన్స్ చేస్తూ " కిచెడ్ " అనే ఫర్నిచర్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బిజినెస్ లో ఒక అడుగు వేసింది. జువెల్లరీ, ఆర్నమెంట్స్ పై ఉన్న ఇష్టంతో ఈ ముద్దుగుమ్మ తన ఓన్ డిజైన్స్ ని ఆన్ లైన్ ద్వారా " వైట్ అండ్ గోల్డ్ జువెలరీ " అనే పేరుతో విక్రయిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం ఎక్కడా తగ్గేదేలే అంటూ " సాకీ " గార్మెంట్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా బ్రాండెడ్ క్లోత్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేయాలనే మంచి మోటోతో సామ్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇక మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికి తెలిసిన విషయమే. "F45 ఫిట్నెస్ స్టూడియోస్" అనే స్టూడియోని స్టార్ట్ చేసి హెల్త్ అండ్ బాడీ ఫిట్ నెస్ మీద ఈ ముద్దుగుమ్మ అవేర్నెస్ తీసుకొస్తుంది. "బూట్ లెగ్గెర్ రెస్టారెంట్" అంటూ హీరోయిన్ ప్రణీత ఫుడ్ బిజినెస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా పలువురు హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా వ్యాపారరంగంలో కూడా అదరగొడ్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :