ASBL NSL Infratech

బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విజేతగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’  భారత్‌కు ఆస్కార్ అవార్డ్‌.. 

బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విజేతగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’  భారత్‌కు ఆస్కార్ అవార్డ్‌.. 

95వ అకాడ‌మీ వేడుక‌ల్లో ఇండియా తొలి ఆస్కార్ అవార్డ్ ద‌క్కింది. బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ విజేత‌గా నిలిచిన‌ట్లు జ్యూరీ ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని కార్తీక్ గోన్‌స్లేవ్స్ డైరెక్ట్ చేశారు. హాల్ ఔట్‌, మార్తా మిచెల్ ఎఫెక్ట్‌, స్ట్రేంజ‌ర్ ఎట్ ది గేట్‌ల‌తో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ పోటీ ప‌డి విజేత‌గా నిలిచింది. ఈ ఏడాది మ‌న దేశం త‌ర‌పున‌ తొలి అవార్డు ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకోవ‌టం విశేషం. మ‌దుమ‌లై నేష‌న‌ల్పా ర్క్‌బ్యాక్‌డ్రాప్‌లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ తెర‌కెక్కింది. బొమ్మ‌న్‌, బెల్లీ అనే దంపతులు ఓ ఏనుగు పిల్ల‌ను పెంచుకుంటారు. దానికి ర‌ఘు అనే పేరు పెట్టుకుంటారు. ఈ సినిమాలో వారి మ‌ధ్య అనుబంధాన్ని, ప్రేమ‌ను తెలియ‌జేయ‌ట‌మే, అడ‌వి అందాల‌ను అద్భుతంగా చూపించారు.

2022లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. అట్టహాసంగా జరుగుతున్న ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమొంటే.. ఆస్కార్ వేడుక‌ను ప్రారంభించ‌టానికి ముందే నాటు నాటు పాట‌ను వేదిక‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ లైవ్ పెర్ఫామెన్స్‌కి స్టేజ్ అదిరిపోయింది. ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 1929లో ఆస్కార్ అవార్డులు మొదలైనప్పటి నుంచి మన భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి. పైగా ఈసారి ఆస్కార్ నామినేషన్‌లో అందరూ ఆర్ఆర్ఆర్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :