ASBL NSL Infratech

టాలీవుడ్ హీరోల‌కు త‌మిళ డైరెక్ట‌ర్ల షాకులు

టాలీవుడ్ హీరోల‌కు త‌మిళ డైరెక్ట‌ర్ల షాకులు

తమిళ డైరెక్ట‌ర్ల మీద టాలీవుడ్ హీరోల ఇంట్రెస్ట్ ఈరోజుది కాదు. ఓ ద‌శ‌లో అది ఇంట్రెస్ట్ ను దాటి మోజుగా మారింది. మ‌ధ్య‌లో కొన్నేళ్లు త‌మిళ డైరెక్ట‌ర్లకు తెలుగు హీరోలు దూరంగా ఉన్నారు కానీ కొన్నేళ్ల నుంచి మ‌ళ్లీ వారి పైనే మ‌న హీరోల క‌న్ను ప‌డింది. కానీ ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల‌తో వారితో సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్ల‌కు షాకులు త‌ప్ప‌డం లేదు. 

కొన్నేళ్ల క్రితం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త‌మిళ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మురుగ‌దాస్ తో జ‌ట్టు క‌ట్టాడు. మురుగదాస్ మంచి ఫామ్ లో ఉండ‌గా మ‌హేష్ స్పైడ‌ర్ చేశాడు. కానీ మ‌హేష్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మిగిలింది. ఆ త‌ర్వాత మురుగుదాస్ చాలా కాలం వ‌ర‌కు కోలుకోలేక‌పోయాడ‌నే చెప్పాలి. త‌ర్వాత అర్జున్ రెడ్డి లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్‌తో నోటా సినిమా చేశాడు. 

ఆ సినిమా విజ‌య్ కెరీర్లో పెద్ద ఫ్లాపుల్లో ఒక‌టిగా నిలిచింది. ఇక గ‌తేడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త‌మిళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ లింగు స్వామితో ది వారియ‌ర్ చేశాడు. లింగుస్వామి ఫామ్ కోల్పోయి చాలా కాల‌మైన‌ప్ప‌టికీ రామ్ రిస్క్ చేసి ఓ డిజాస్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వెంక‌ట్ ప్ర‌భు లాంటి డైరెక్ట‌ర్ కూడా తెలుగు స్టార్ కు ఒక్క హిట్ ఇవ్వ‌లేక‌పోయాడు. ఏరి కోరి నాగ‌చైత‌న్య‌తో క‌స్ట‌డీ అని సినిమా చేశాడు. ఇప్పుడు ఆ సినిమా కూడా డిజాస్ట‌ర్ లెక్క‌లోకే వెళ్లేట్లుంది. మొత్తానికి త‌మిళ డైరెక్ట‌ర్ల‌వ్వ‌రూ టాలీవుడ్ హీరోల‌కు హిట్లు ఇవ్వ‌లేక‌పోతున్నార‌న్న‌మాట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :