ASBL NSL Infratech

సైఫ్ వారసుడిని లాంచ్ చేయబోతున్న కరణ్ జోహార్..!?

సైఫ్ వారసుడిని లాంచ్ చేయబోతున్న కరణ్ జోహార్..!?

బాలీవుడ్ లో ఇక నెక్స్ట్ జనరేషన్ హవా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇప్పటికే పెద్ద స్టార్ల డాటర్స్ ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి వచ్చేసారు. అయితే ఈ స్టార్ హీరోల వారసురాళ్లు ఉన్నంత ఫాస్ట్ గా వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరోల వారసులు సినిమాల్లో హీరోగా చేయడానికే ఇష్టపడుతుంటారు. అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు మాత్రం ఇందుకు భిన్నంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని ఎంచుకోవడం విశేషం. ఈ విషయంలో షారుఖ్ ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ మీడియాలో వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆఫీషియల్ అనౌన్సమెంట్ రాలేదు. ఇక తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొత్త నటీనటుల్ని వెతికే పనిలో ఉన్నారట. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ " సర్జమీన్ " అనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం సైఫ్  తనయుడు, మొదటి భార్య కుమారుడైనటువంటి ఇబ్రహీం అలీ ఖాన్ ని ఫైనలైజ్ చేసినట్టు సమాచారం అందుతుంది. సర్జమీన్ సినిమాకి ఇబ్రహీం హీరోగా కరెక్ట్ గా సరిపోతాడని కరణ్ జోహార్ భావిస్తున్నారట. ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కుతున్న సర్జమీన్ చిత్రంలో హీరోయిన్ ఉంటుందా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్కుని, ఈ నెల 24  నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజోల్, పృథ్వి రాజ్ సుకుమార్ కీలకమైన రోల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :