ASBL NSL Infratech

కొనుగోలుదారుల టేస్ట్ కు అనుగుణంగా నిర్మాణాలు

కొనుగోలుదారుల టేస్ట్ కు అనుగుణంగా నిర్మాణాలు

ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త ట్రెండ్‌ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 2 బీహెచ్‌కే (రెండు బెడ్‌ రూములు, కిచెన్‌)3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల స్థానంలో కొత్తగా అరగది వచ్చి చేరింది. ఇప్పుడు కొత్తగా 2.5 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కావాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. కోవిడ్‌ తర్వాత కొనుగోలుదారులు పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులు లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్‌ కావాలని అడుగుతుండటంతో దీనికి అనుగుణంగా బిల్డర్లు ప్రత్యేకంగా ఒక అర గదిని కూడా నిర్మిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ స్టడీ రూమ్‌ కాన్సెస్ట్‌ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పుడే ప్రవేశించిందని బిల్డర్లు చెబుతున్నారు. స్టడీ రూమ్‌ కాన్సెప్ట్‌కు డిమాండ్‌ పెరగడంతో ఇప్పుడు విశాఖలో పలువురు బిల్డర్లు 2.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కోవిడ్‌ తర్వాత విశాఖ, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో మార్కెట్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉందని రియల్ట్‌ర్లు అంటున్నారు. నగరంలో విశాలమైన ఇంటిని తీసుకోవడానికి బడ్జెట్‌ సరిపోకపోవడంతో కొనుగోలుదారులు ద ృష్టి నగర శివార్ల వైపు మళ్లుతోంది. దీంతో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి పట్టణ శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :