ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్న రాహుల్.. కార్యకర్తల సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు భారతదేశాన్ని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాయని, ఆ శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం చేస్తున్న యుద్ధమే ఈ ఎన్నికలని పేర్కొన్నారు. అలాగే ఆ దుష్ట శక్తులేవో, వాటితో పోరాడుతున్న వారెవరో కూడా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

అంతకుముందు సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ భారీ రోడ్ షో నిర్వహించారు. మొదట హెలికాప్టర్‌లో వాయనాడ్‌లోని ముప్పైనాడ్ గ్రామానికి చేరుకున్న రాహుల్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కలపేట చేరుకున్నారు. అనంతరం కలపేట నుంచి ఉదయం 11 గంటలకు రోడ్‌షో ప్రారంభించారు. కీలక నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్, కన్హయ్య కుమార్, కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎం హసన్‌లతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను మీ ఎంపీని కావడం ఎంతో గర్వంగా ఉంది. మీ అందరినీ నా సోదరి ప్రియాంకలా భావిస్తాను. ఈ నియోజకవర్గంలో అడవి జంతువుల దాడులు ఎక్కువగా జరుగుతుండడం పెద్ద సమస్య. అలాగే మెడికల్ కాలేజీ సమస్య, వీటన్నింటినీ పరిష్కించాలని నేను ప్రభుత్వాన్ని కోరాను. సీఎంకు లేఖ కూడా రాశాను. కానీ ఫలితం లేదు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

అలాగే అది యూడీఎఫ్ అయినా లేదా ఎల్డీఎఫ్ అయినా..  ప్రతి ఒక్కరూ తన కుటుంబం సభ్యులవంటివారేనని.. భావజాలంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో తాను మీ నుంచి చాలా నేర్చుకున్నా అని రాహుల్ అన్నారు. ప్రస్తుతం వాయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ దఫా ఆయనకు ఇక్కడి నుంచి బలమైన పోటీ ఎదురుకానుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ.. సీపీఐ పార్టీ వయనాడ్‌లో తమ అభ్యర్థిగా అన్నే రాజాను నిలబెట్టింది. అలాగే బీజేపీ కూడా తమ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ను పోటీకి దింపింది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :