ASBL NSL Infratech

ఇస్మార్ట్ జోడీ మూవీ రిలీజ్‌కు ఇస్మార్ట్ డేట్ ఫిక్స్

ఇస్మార్ట్ జోడీ మూవీ రిలీజ్‌కు ఇస్మార్ట్ డేట్ ఫిక్స్

లైగ‌ర్ సినిమా ప్రమోష‌న్స్ లో తానొక మాస్ట‌ర్ పీస్ సినిమా తీశాన‌నుకున్న పూరీకి, ఆ సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాత ఎవ‌రికీ మొహం చూపించుకోలేక‌పోయాడు. లైగ‌ర్ త‌ర్వాత పూరీ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నుకున్న అంద‌రూ. ఆఖ‌రికి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా  అప్ప‌టికే అనౌన్స్ చేసిన జ‌న‌గ‌ణ‌మ‌న కూడా చేయ‌కుండా త‌ప్పించుకున్నాడు. 

ఒక‌వేళ విజ‌య్ ఓకే అనుకున్నా ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మ‌నుకున్న పూరీ అక్క‌డితో డ్రాప్ అయిపోయాడు. పూరీని న‌మ్మి ఇలాంటి సిట్యుయేష‌న్స్ లో ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇచ్చే ప‌రిస్థితుల్లో లేడు. దీంతో ఆరు నెల‌ల‌కు పైగా ఖాళీగా ఉన్నాడు పూరీ. పూరీకి ఫ్లాప్ లు, డిజాస్ట‌ర్లు కొత్తేమీ కాదు కానీ ఇంకో సినిమా లేక ఖాళీగా ఉండ‌టం మాత్రం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. 

ఇప్పుడు పూరీని ఇలాంటి క‌ష్టం నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఎనర్జిటిక్ హీరో రామ్ ముందుకొచ్చాడు. ఇంత‌కుముందు కూడా పూరి ఇలాంటి సిట్యుయేష‌న్ లో ఉన్న‌ప్పుడు రామ్ ముందుకొచ్చి అత‌నితో ఇస్మార్ట్ శంక‌ర్ తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉండ‌గా, రామ్ ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. వీరి కాంబోలో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. 

దీనికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా త్వ‌ర‌లోనే మొద‌లు కాబోతున్నాయ‌ట‌. ఈ స్క్రిప్ట్ కోసం పూరీ చాలా టైమ్ తీసుకుని మ‌రీ రెడీ చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. అక్టోబ‌ర్ నాటికి సినిమాను సెట్స్ కు తీసుకెళ్‌లి ఆరు నెల‌ల్లో సినిమాను పూర్తి చేయాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తం ప‌నులు ముగించుకుని జులై 18న సినిమా రిలీజ్ చేయాల‌ని పూరీ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. జులై 18న ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాల‌ని పూరీ-రామ్ కాంబో భావిస్తుంద‌ట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :