ASBL NSL Infratech

ప్ర‌భాస్ మారుతి మూవీలో అవే హైలైట్

ప్ర‌భాస్ మారుతి మూవీలో అవే హైలైట్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజా డీల‌క్స్ అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అందులో ఒక‌రు మాళ‌విక మోహ‌న‌న్. ప్ర‌భాస్-మాళ‌విక కాంబోలో సీన్స్ రీసెంట్‌గా షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 

వీరి మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్స్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉంటాయ‌ని సినిమా యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. మారుతి మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆ ల‌వ్ ట్రాక్ స‌న్నివేశాలు క‌లిగి ఉంటుంద‌ని తెలుస్తోంది. మారుతితో ప్ర‌భాస్ సినిమా అనగానే చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. 

ఆ ట్రోల్స్ చేసిన వారికి ఆన్స‌ర్ ఇచ్చేలా ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నాడు మారుతి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ కె, సలార్, ఆదిపురుష్ సినిమాల‌కు మారుతి డైరెక్ష‌న్ లో సినిమా ఏ మాత్రం త‌క్కువ కాద‌ని, జోన‌ర్ వేరే అయినా కూడా క‌చ్చితంగా ఈ సినిమా ఆ స్థాయి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట మారుతి. 

ప్ర‌భాస్ చాలా కాలం త‌ర్వాత ఈ ల‌వ్ ట్రాక్ ఉన్న స‌న్నివేశాలు చేస్తున్న నేప‌థ్యంలో ఈ సినిమా ఆయ‌న ఫ్యాన్స్ కు స‌ర్‌ప్రైజ్ గా ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవకాశ‌ముంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :